ఈ ఆర్టికల్ లో మేము మీకు కొన్ని మంచి పెట్టుబడి లేని, ఇంటి దగ్గర నుండి చేసుకోగలిగే వ్యాపార మార్గాలు (Zero Investment Business Ideas) పొందుపరచడం జరుగుతుంది మీరు కూడా వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని వెంటనే మొదలు పెట్టండి, తద్వారా నెలకి లక్ష రూపాయలు పైబడి సంపాదించండి.

Top 5 Zero-Investment Business Ideas In India:
- Freelancing
- Content Creation
- Affiliate Marketing
- Dropshipping
- Online Tutoring or Coaching
Freelancing:
మీకు ఏదైనా ప్రత్యేకమైన Skill ఉంటే ఉదాహరణకు writing, graphic design, video editing, coding, SEO, website designing, or marketing ఇలా ఏదైనా మీకు వచ్చిన Skill ను మీరు మీ సేవలను ఈ క్రింది ప్లాట్‌ఫామ్‌లలో అందించవచ్చు.
పైన చెప్పిన skills ను మీరు సర్వీస్ (సేవలను) కస్టమర్స్ కి అందిస్తూ వాళ్ళ దగ్గర నుండి కొంత డబ్బులు తీసుకోవచ్చు (Service Charge). Fiverr, Upwork, And Freelancer అనే ఈ 3 ప్లాటుఫామ్ లు పూర్తిగా ఉచితం. కేవలం మీరు మీ యొక్క skills ను ప్రదర్శించుకొని మీ నైపుణ్యం చూపించుకుంటే చాలు.
Content Creation (YouTube / Instagram / Blogging):
మీరు ఒక YouTube channel, Instagram Page, మరియు ఒక మంచి Blog website ను మొదలుపెట్టి, వాటి ద్వారా మీకు వచ్చిన, తెలిసిన విషయాలను ప్రజలకి ఉచితంగా అందించడం ద్వారా కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు సులభంగా చేయగలిగే కొన్ని topics ఇక్కడ చెప్తాను చూడండి. (tech, education, beauty, cooking, or motivation)
Income Sources:
- Ad revenue
- Brand Promotion
- Affiliate Marketing
Affiliate Marketing:
Affiliate Marketing అనేది ఇతరుల ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఒక మార్గం. ఎవరైనా మీ ప్రత్యేకమైన Affiliate Link ను ఉపయోగించి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, మీరు కమీషన్ (అమ్మకంలో ఒక శాతం) సంపాదిస్తారు.
ఉదాహరణకు Amazon అనే ecommerce business లో కొన్ని లక్షల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు అవసరమైన వ్యక్తులకు మీరు మీ లింక్ ద్వారా అమ్మడం వలన మీకు మంచి లాభ శాతం వస్తుంది. మీరు Amazon Affiliate Program లో ఉచితంగా register చేసుకుని పనిచేసుకోవచ్చు.
Dropshipping:
Dropshipping అనేది రిటైల్ వ్యాపార నమూనా, దీనిలో మీరు ఎటువంటి ఇన్వెంటరీని ఉంచకుండా ఆన్‌లైన్‌లో ఉత్పత్తులను విక్రయిస్తారు. మీరు ఫ్రీ గా ఒక సొంత ఆన్లైన్ స్టోర్ ను సిద్ధం చేసుకుని అందులో నేరుగా కంపెనీ యొక్క ఉత్పత్తులను లోడ్ చేస్తారు.
బదులుగా, ఎవరైనా మీ ఆన్‌లైన్ స్టోర్ నుండి ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు మీరు ఆర్డర్‌ను మీ సరఫరాదారుకు ఫార్వార్డ్ చేస్తారు. సరఫరాదారు ఉత్పత్తిని నేరుగా మీ కస్టమర్‌కు పంపుతారు.
మీరు సరఫరా దారుని యొక్క ధర కంటే ఎక్కువధరకు అమ్ముకొంటారు. అలా చేయడం వలన మీరు అధిక లాభాలను పొందవచ్చు.
Popular Dropshipping Platforms In India:
- Meesho
- Glowroad
- Shopify
Online Tutoring or Coaching:
మీకు ఏదైనా ఒక విషయం లో మంచి జ్ఞానం కలిగి ఉంటే (ఉదాహరణకు: Spoken English Skills, Digital Marketing Skills, Business Skills Like That) వాటిని మీరు ఇతరులకు Online ద్వారా కానీ Offline ద్వారా కానీ నేర్పించవచ్చు. అలా నేర్పించినందుకు మీరు వాళ్ళ దగ్గర నుండి కొంత ఫీజు తీసుకోవచ్చు.